
పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
అదృశ్యమైన బాలిక ఆచూకీ తెలపాలంటూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి అద్దాలను, కుర్చీలను విరగ్గొట్టారు. గొర్రె పిల్లలను మేపుకొనేందుకు వెళ్లిన బాలిక సుమీయ అక్కడ స్పృహ తప్పిపోయి రాత్రి 10:30 గంటలకు గొర్ల మంద వద్దకు చేరుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అదృశ్యమైన బాలిక కనిపించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. డీఎస్పీ మురళి నాయక్ బాలిక దగ్గరకు వెళ్లి మాట్లాడి తల్లిదండ్రులతో సహా కడప రిమ్స్కు తరలించారు. కాగా గ్రామస్తులు మాత్రం బాలికను చూపించాలని పోలీసు స్టేషన్ వద్ద నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.