
వైఎస్ రాజారెడ్డి ఆదర్శప్రాయుడు
● ఘనంగా వైఎస్ రాజారెడ్డి వర్ధంతి
● నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మ, వైఎస్ సుధీకర్‌రెడ్డి
పులివెందుల : దివంగత వైఎస్ రాజారెడ్డి ఆదర్శప్రాయుడు అని వైఎస్సార్ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి, పులివెందుల మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి పేర్కొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం వైఎస్ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్ సమాధుల తోటలో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మ సమాధుల వద్ద వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి, వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ పాస్టర్లు ఆనందబాబు, నరేష్‌కుమార్, మృత్యుంజయలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి పేద ప్రజలకు చేసిన సేవలు, పులివెందుల అభివృద్ధికి ఆయన పాటుపడిన విషయాలను గుర్తుకు తెచ్చుకున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడానికి వైఎస్ రాజారెడ్డి కృషి ఎనలేనిదన్నారు. వైఎస్ కుటుంబం ప్రముఖ స్థానంలో నిలవడానికి ఆయన ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. అనంతరం అక్కడే ఉన్న దివంగత వైఎస్ జార్జిరెడ్డి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి, దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డిల సమాధులతోపాటు ఇతర బంధువుల సమాధుల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్ ఫౌండేషన్ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, వైఎస్ జగన్ వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, కౌన్సిలర్లు కోడి రమణ, కిశోర్, వెంగమునిరెడ్డి, పార్నపల్లె నాయుడు తదితరులు పాల్గొన్నారు.