
చర్చకు సిద్ధమని చెప్పినా కాల్చేయడం దారుణం
కడప ఎడ్యుకేషన్ : మాబోయిస్టులు శాంతి చర్చలు కోరుతున్నా.. ఆపరేషన్ కగార్ పేరిట చత్తీస్‌ఘడ్, బస్తర్ అడవుల్లో మారణకాండ సాగించడం దారుణమని ఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం.ఓబులేసుయాదవ్ పేర్కొన్నారు. కడప విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎన్‌కౌంటర్ పేరుతో సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి సంబాల కేశవరావు, మరింతమంది మావోయిస్టులు, ఆదివాసీలను కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చట్ట విరుద్ధంగా సాగిన హత్యాకాండపై న్యాయ విచారణ చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజా సంఘాల నిరసన ప్రయత్నాన్ని భగ్నం చేసి, పోలీసులు హడావుడి చేస్తున్నారని, ప్రజల హక్కులపై ఆంక్షలు విధించవద్దని విజ్ఞప్తి చేశారు.