
వీర జవాన్ పోరాటం.. స్ఫూర్తిదాయకం
కడప కార్పొరేషన్ : వీరజవాన్ మూడే మురళీ నాయక్ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని పలు పార్టీల నాయకులు కొనియాడారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎర్రముక్కకపల్లె సర్కిల్‌లోని అమరవీరుల సైనిక స్థూపం వద్ద ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి మురళీ నాయక్‌కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన జవాన్ మురళి నాయక్ యువతరానికి ఆదర్శనీయమన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను మురళి నాయ క్ యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయిన వా ర్త అందరినీ తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందన్నా రు. దేశం కోసం ఆయన వీర మరణం పొందారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ నాయక్, సీపీఐ నాయకులు వెంకట శివ, వేణుగోపాల్, టీడీపీ నాయకుడు తిరుమలేష్, సంఘం రాష్ట్ర కోశాధికారి శివా నాయక్, జిల్లా అధ్యక్షుడు, జగన్ రాథోడ్, చెన్నక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళి కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అన్ని విధాలుగా అండగా ఉండాలని గిరిజన సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేద్రి సు ధాకర్ అన్నారు. శుక్రవారం కడపలోని తారక రామనగర్‌లో మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో శ్రీచరణ్ పాల్గొన్నారు.
భారత సైన్యానికి మద్దతుగా..
ప్రొద్దుటూరు కల్చరల్ : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న భారత సైన్యానికి మద్దతుగా శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజలరెడ్డి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక గాంధీరోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభ మైన ఈ కాగడాల ప్రదర్శన పుట్టపర్తి సర్కిల్ వరకు జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పహల్గాం ఘటనలో ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపడం దారుణమన్నారు. జాతీయ జెండాలను చేతపట్టి భారత్ మాతాకి జై, హిందూస్థాన్ జిందాబాద్, పాకిస్థాన్ డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ ఇంచార్జ్ చైర్మన్ ముక్తియార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, నంద్యాల కొండారెడ్డి, మురళీధర్‌రెడ్డి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళి
అమరవీరుడు మురళి నాయక్
– ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల : పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో మరణించిన వీర జవాన్ మురళి నాయక్ అమరవీరుడని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ నిజమైన హీరో అన్నారు. మురళి నాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలని, ఆయన వీర మరణం పొందడం ద్వారా తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దేశానికి చాటి చెప్పాడు అన్నారు. వీర జవాన్ మురళి నాయక్ ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు.

వీర జవాన్ పోరాటం.. స్ఫూర్తిదాయకం

వీర జవాన్ పోరాటం.. స్ఫూర్తిదాయకం