ఫ ఎమ్మెల్సీ కోదండరాం
భువనగిరి: నిజమైన ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ 17వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ఏర్పాటు చేసిన మలిదశ ఉద్యమకారుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1980 నుంచి 2014 వరకు దశలవారీగా జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఉద్యమకారులుగా గుర్తించాలన్నారు. అనంతరం ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య మాట్లాడుతూ ఎలాంటి కాలయాపన చేయకుండా ఉద్యమకారులను గుర్తించి వారికి సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాశపాక మహేష్ అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో కావలి యాదయ్య, పాకాల వెంకన్న, బట్టు రాంచంద్రయ్య, పవన్‌కుమార్, బాలస్వామి, నరసింహ, శ్రీను, మల్లారెడ్డి, చెన్నయ్య పాల్గొన్నారు.


