వర్షాభావంపై సమగ్ర నివేదికలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

వర్షాభావంపై సమగ్ర నివేదికలు ఇవ్వాలి

Oct 10 2026 1:40 AM | Updated on Oct 10 2026 1:40 AM

భువనగిరిటౌన్‌ : వర్షాభావ నేపథ్యంలో నేలలో తేమ విశ్లేషణ, రిజర్వాయర్లలో నీటి నిల్వ వివరాలు, వర్షపాతం, విద్యుత్‌ వినియోగ డేటాను క్రోడీకరించి వెంటనే సమగ్ర నివేదికలను సమర్పించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ అధికారి హేమలతతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

21 పోలీస్‌ సంస్మరణ దినోత్సవం

యాదగిరిగుట్ట రూరల్‌: ఈ నెల 21న నిర్వహించనున్న పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామ పరిధిలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్‌ నిర్వహణ, బందోబస్తు, వేదిక ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్‌ నాయుడు, సీఐ భాస్కర్‌, ట్రాఫిక్‌ సీఐ వెంకటేశ్వరరావు ఉన్నారు

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు యాదాద్రిలో హాల్టింగ్‌

కాజీపేట రూరల్‌ : కాజీపేట జంక్షన్‌ మీదుగా సికింద్రాబాద్‌– సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–హైదరాబాద్‌ (07711/07712) మధ్య ప్రయాణించే బతుకమ్మ, దసరా డైలీ ప్రత్యేక రైళ్లకు యాదాద్రి స్టేషన్‌లో హాల్టింగ్‌ కల్పించినట్లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కాజీపేట మీదుగా అప్‌అండ్‌డౌన్‌ రూట్లలో ప్రయాణించే 34 బతుకమ్మ, దసరా ప్రత్యేక రైళ్లకు ప్రయాణికుల సౌకర్యార్థం యాదాద్రి రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్‌ కల్పించినట్లు సీపీఆర్వో పేర్కొన్నారు.

నేటి నుంచి దసరా సెలవులు

భువనగిరి : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శనివారం నుంచి దసరా పండుగ సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 1 నుంచి 9 వరకు పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఎస్‌ఏ–1 పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలు శుక్రవారంతో ముగియడంతో ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటిచింది. తిరిగి పాఠశాలలలు ఈ నెల 23న పునఃప్రారంభం అవుతాయని, ఈ సెలవుల్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఈఓ భిక్షపతి చెప్పారు. గురుకులాలు, హాస్టళ్లలో ఉంటూ చదివే విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో ఒకపక్క విద్యార్థులు.. మరోపక్క ఇతర ప్రయాణికులతో బస్టాండ్లలో రద్దీ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement