లప్పానాయక్‌ తండావాసులకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

లప్పానాయక్‌ తండావాసులకు అండగా ఉంటాం

Oct 10 2026 1:40 AM | Updated on Oct 10 2026 1:40 AM

యాదగిరిగుట్ట రూరల్‌: పునరావాస స్థలంలో లప్పానాయక్‌ తండావాసులకు అన్ని మౌలిక వసతులు కల్పించి మినీ బంజారాహిల్స్‌గా మార్చి అండగా ఉంటామని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లి గ్రామంలోని పునరావాస స్థలంతో లప్పానాయక్‌ తండావాసులకు శుక్రవారం 250 ప్లాట్ల పట్టాలను డ్రా ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గంధమల రిజర్వాయర్‌తో సర్వస్వం కోల్పోయిన తండావాసులకు దాతర్‌పల్లి పునరావాస స్థలంలో మంచి గ్రామాన్ని ఏర్పాటు చేసుకుందామన్నారు. పునరావాస స్థలంలో 100 ఇందిరమ్మ ఇళ్ల ప్యాకేజీని ఇవ్వమని సీఎం రేవంత్‌రెడ్డిని అడుగుతానన్నారు. ప్లాట్లల్లో ఇళ్లు కట్టుకునే 250 మందికి బీర్ల ఫౌండేషన్‌ తరఫున ఒక్కో లబ్ధిదారుడికి 200 సిమెంటు బస్తాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆలేరు గడ్డ ఐలయ్యదే గుర్తు పెట్టుకోండి అని ప్రభుత్వం విప్‌ ఐలయ్య ప్రస్తావించారు. నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే ఇటీవల కొంతమంది బీఆర్‌ఎస్‌ నాయకులు తనపై ఇష్టానుసారంగా మట్లాడుతున్నారన్నారు. తనను విమర్శించే వారి తిట్లు తనకు ఆశీర్వచనాలు అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్‌ గణేష్‌ నాయక్‌, డీటీ సత్యనారాయణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ చీర శ్రీశైలం, సర్పంచ్‌ గాసీరాం నాయక్‌, ఉపసర్పంచ్‌ ధీరావత్‌ లక్ష్మి, కాల్నె సరిత, కాల్నె భాస్కర్‌, బిచ్యానాయక్‌, భరత్‌, శంకర్‌ నాయక్‌ పాల్గొన్నారు.

ఫ ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement