రామన్నపేట : ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వేమవరపు ప్రసన్న, రత్నాకర్ దంపతులు చేసిన కృషి చిరస్మరణీయమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు. ఆదివారం రత్నాకర్ దంపతుల 23వ వర్ధంతి సందర్భంగా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో వారి విగ్రహాలకు చిరుమర్తి లింగయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు వేమవరపు సుధీర్‌బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని వేమవరపు ప్రసన్న సమర్ధవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందారని అన్నారు. నిరుపేదల పిల్లల ఉన్నత చదువులను వారు ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కమ్మంపాటి శ్రీనివాసులు, గర్దాసు విక్రం, నాయకులు వేమవరపు సుధీర్‌బాబు, దూదిమెట్ల సత్తయ్య, పోచబోయిన మల్లేశం, బందెల రాములు, ఎడ్ల మహేందర్‌రెడ్డి, అంబటి రవీందర్‌రెడ్డి, మేకల రాజిరెడ్డి, బొక్క మాధవరెడ్డి, కన్నెబోయిన బలరాం, పిట్ట కృష్ణారెడ్డి, పులిపలుపుల వీరస్వామి, ఇడెం శ్రీనివాస్, చిన్నపాక శ్రీనివాస్, మిర్యాల మల్లేశం, ఎడ్ల నరేందర్‌రెడ్డి, సొప్పరి నర్సింహ, బుర్ర శ్రీశైలం, బాసాని రాజు, ఆవుల శ్రీధర్, జెట్టి శివప్రసాద్, చిన్నపాటక రమేష్ పాల్గొన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య


