భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల డిజైన్లు ఎంతో బాగున్నాయని ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ వినోద్‌రెడ్డి అన్నారు. ఆదివారం పోచంపల్లిలోని చేనేత గృహాలను సందర్శించి మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాల తయారీని పరిశీలించారు. చేనేత వస్త్రాల నాణ్యత, డిజైన్లు చూసి కార్మికుల నైపుణ్యాలను అభినందించారు. అనంతరం వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో కేవీటీ స్పోర్ట్ క్లబ్ అధ్యక్షుడు, అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్నాటి వెంకటబాలసుబ్రమణ్యం, టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, పద్మశాలి పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రుద్ర పాండురంగ శాస్త్రి, మహేశ్, ఓంప్రకాశ్, సతీష్, ప్రసాద్, రాంమాధవ్ తదితరులు ఉన్నారు.
ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్
వినోద్‌రెడ్డి


