మద్దతు కంటే అధిక ధర | - | Sakshi
Sakshi News home page

మద్దతు కంటే అధిక ధర

Oct 4 2026 11:13 AM | Updated on Oct 4 2026 11:13 AM

తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యానికి ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధర కంటే అధికంగా వస్తున్నది. మార్కెట్‌కు శనివారం 7,157 బస్తాల ధాన్యం వచ్చినట్లు మార్కెట్‌ కార్యదర్శి శంషేర్‌ తెలిపారు. మార్కెట్‌లో దొడ్డు ధాన్యానికి (ఐఆర్‌ 64) గరిష్ఠంగా క్వింటాకు రూ.2480, కనిష్టంగా రూ.2200 ధర పలికింది. సాంబమసూరి క్వింటాకు గరిష్టంగా రూ.3051, కనిష్ఠంగా రూ.2902 పలికింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2461 కాగా మార్కెట్‌లో అంతకు మించి ధర రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement