ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయాలన్న నిర్ణయాన్ని గుడిమల్కాపురం రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామంలోని రైతు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భూసేకరణ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
సంస్థాన్ నారాయణపురం: మండలంలో ప్రభుత్వ భూములపై హెచ్‌ఎండీఏ దృష్టి సారించింది. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నేపథ్యంలో జిల్లాలో భూముల విలువ అమాంతం పెరుగుతుండటంతో.. ప్రభుత్వ భూములతో పాటు వాటికి ఆనుకుని ఉన్న పట్టా భూములను సేకరించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు ఇప్పటికే భూముల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు, భూ స్వభావం తదితర వివరాలను సేకరించి కలెక్టర్‌కు నివేదిక అందజేసినట్లు సమాచారం. ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) పద్ధతిలో వీటిని సేకరించి మౌలిక వసతులతో కూడిన లేఅవుట్లుగా అభివృద్ధి చేసి, వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.
గుడిమల్కాపురంలో 190 ఎకరాలు..
హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే భువనగిరి, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్, బొమ్మలరామారం, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో ఈ భూముల గుర్తింపు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడిమల్కాపురం గ్రామ పరిధిలో సర్వే నంబర్ 64 నుంచి 79 వరకు 190 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ఇందులో సర్వే నంబర్ 78లో 120 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. దానికి ఆనుకుని మరో 70 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి.
ల్యాండ్ పూలింగ్.. ఆదాయమే లక్ష్యం!
గుర్తించిన భూముల్లో ప్రణాళికాబద్ధంగా రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్ వంటి మౌలిక వసతులతో లేఅవుట్లు అభివృద్ధి చేయనున్నారు. అనంతరం వాటిని వేలం ద్వారా విక్రయించి ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. పట్టా భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించి, అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో కొంత భాగాన్ని భూ యజమానికి కేటాయించి, మిగతా భూమిని హెచ్‌ఎండీఏ విక్రయించే యోచనలో ఉంది. అయితే, ఇది కేవలం ముందస్తు కసరత్తా? లేక ల్యాండ్ పూలింగ్ ఫైనల్ అయిందా? అన్న దానిపై అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.
ఫ ప్రభుత్వ భూములపై హెచ్‌ఎండీఏ నజర్
ఫ నారాయణపురం మండలంలో ల్యాండ్ పూలింగ్‌కు సన్నాహాలు
ఫ గుడిమల్కాపురంలో 190 ఎకరాలు గుర్తింపు
ఫ కలెక్టర్‌కు నివేదిక పంపిన రెవెన్యూ అధికారులు
ఫ అభివృద్ధి చేసి వేలం ద్వారా ఆదాయం రాబట్టే యోచన


