నిడమనూరు : ఉపాధి కోసమని సిమెంటు ఇటుకుల తయారీ, రెడిమేడ్ వాల్ బ్లాక్‌లను బిగించేందుకు వచ్చిన కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కనగల్ మండలం సల్మాన్‌నగర్‌కు చెందిన అలకుంట్ల రాము (17) గురువారం సాయంత్రం నిడమనూరు మండలంలోని రాజన్నగూడెంలోని కంచనపల్లి సోమమ్మ ఇంటి ప్రహరీకి వాల్ బ్రిక్స్‌ను బిగిస్తున్నాడు. బ్లాక్ కొంత పెద్దదిగా ఉండటంతో కట్టర్ సాయంతో కట్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైయ్యారు. రామును 108 అంబులెన్స్‌లో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నిడమనూరు ఎస్సై విజయ్‌కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పరిహారం కోసం కుటుంబ సభ్యుల ఆందోళన
పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతుడు రాము కుటుంబ సభ్యులు శుక్రవారం బ్రిక్స్ యాజమాని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఆ పనిని తాను చేయలేదని, కాంట్రాక్టర్‌కు అప్పగించానని వాల్ బ్రిక్స్ తయారీ యజమాని గిరి తెలపడంతో ఆ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. పరిహారం విషయంలో వాల్‌బ్రిక్స్ తయారీదారుడు, కాంట్రాక్టర్ కలసి చెల్లించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బ్రిక్స్ బిగించే పనికి తనకు సంబంధం లేదని బ్రిక్స్ తయారీదారుడు చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు వారిని సద్దుమణిగించారు.
ఫ విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
ఫ ప్రహరీకి ప్రీకాస్ట్ బ్రిక్స్
బిగిస్తుండగా ప్రమాదం


