పెండింగ్‌ పనులు త్వరగా పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ పనులు త్వరగా పూర్తిచేయాలి

Jun 14 2026 11:49 AM | Updated on Jun 14 2026 11:49 AM

భువనగిరిటౌన్‌ : సింగన్నగూడెం గ్రామంలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాలనీలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. శనివారం వారు భువనగిరి మండలం సింగన్నగూడెం గ్రామంలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాలనీలో పెండింగ్‌ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్దేశిత గడువులోగా పనలు పూర్తి చేయాలని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. లబ్ధిదారులకు విద్యుత్‌, నీటి సరఫరా కనెక్షన్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్‌ చైర్మన్‌ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌,వైస్‌చైర్మన్‌ పోతంశెట్టి మంజులవెంకటేశ్వర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఇంజనీరింగ్‌ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement