వారంలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి
భువనగిరి : అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో జిల్లా అధికారిలు కసరత్తు ప్రారంభిచారు. మొదట పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టిన తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సైతం విడుదల కావడంతో త్వరలో ప్రక్రియను చేపట్టేందుకు సంబంధిత శాఖ అధికారులు సిద్ధమయ్యారు.
బదిలీలు, పదోన్నతుల అనంతరం..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 901 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో టీచర్ల పోస్టులు 62, ఆయాల పోస్టులు 281 ఖాళీలు ఉన్నాయి. టీచర్ల పోస్టులను అర్హులైన ఆయాలకు పదోన్నతుల కల్పించడం ద్వారా భర్తీచేయనున్నారు. వీరిలో ఇంటర్మీడియేట్ చేసి ఐదేళ్లు అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పించనున్నారు. మిగిలిన ఖాళీలను ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం భర్తీ చేయనున్నారు. దీంతో పాటు ఆయాల విషయంలో 65 ఏళ్లు నిండిన వారిని గుర్తించి స్వచ్ఛంద విరమణపై ఆసక్తి ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు.
మౌఖిక పరీక్షకు 10 మార్కులు
గతంలో 100 మార్కులను వెయిటేజ్ కింద కేటాయించగా ఇందులో ఇంటర్మీడియేట్ పూర్తిచేసిన వారికి 80, మిగతా వాటికి మౌఖిక పరీక్ష నిర్వహించేశారు. ఇందులోనే వితంతువులకు 5, అనాథలకు 10, దివ్యాంగులకు 5 మార్కుల చొప్పున రిజర్వేషన్ కేటాయించారు. తాజాగా 80 మార్కులే కేటాయించి ఇంటర్మీడియేట్ అర్హతకు 70 మార్కులకు కుందించారు. మిగతా 10 మార్కులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు.
ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో..
అంగన్‌వాడీ టీచర్ల ఖాళీలను పారదర్శకంగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా ఆర్డీఓ, జిల్లా వైద్యాధికారి, కన్వీనర్‌గా జిల్లా సంక్షేమ శాఖ అధికారి వ్యవహరించనున్నారు. జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీల వివరాలపై కలెక్టర్‌కు నివేదిక అందిజేస్తారు. అనంతరం నోటిఫికేషన్ విడుదల చేసిన దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంపిక జాబితాను ప్రభుత్వానికి నివేదించి ఆమోదం పొందిన తర్వాతన నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
ఫ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
ఫ త్వరలో పదోన్నతులు, బదిలీలు
ఫ ఆ తర్వాత ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
ఫ జిల్లాలో 62 టీచర్లు.. 281 ఆయా పోస్టులు ఖాళీ
ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించాం. ముందుగా పదోన్నతుల ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేస్తాం, అనంతరం ఖాళీల వివరాలను సేకరించి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం. అనంతరం మిగిలిన ఖాళీలపై నోటిఫికేషన్ విడుదల చేసి నిబంధనల ప్రకారం భర్తీ చేస్తాం.
– కె.నరసింహారావు, జిల్లా సంక్షేమ అధికారి


