వికలాంగుల ఆర్థిక సాధికారతే లక్ష్యమని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు.
- 8లో
ఈ ఫొటోలో కన్పిస్తున్న రైతు పేరు బెల్లంకొండ శంకరయ్య. సొంతూరు సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం. తనకున్న ఆరెకరాల్లో రెండు ఎకరాలు వరి సాగు చేస్తున్నాడు. దానికోసం రెండేళ్ల కాలంలో 8 బోర్లు వేయించాడు. ఒక్కో బోరు 500 నుంచి 600 ఫీట్ల వరకు వేయించాడు. దీనికోసం సుమారు రూ.7 లక్షల వరకు ఖర్చు చేశాడు. గత మార్చిలో కూడా వరి పంటను కాపాడుకోవడానికి రెండు బోర్లు వేయించాడు. వీటి కోసం సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేశాడు. ఈరెండింటిలో ఒక బోరు హాఫ్ ఇంచ్, మరొక బోరు ఇంచు నీళ్లు పోస్తున్నాయి. ఈ నీళ్లతో అర ఎకరం కూడా పారే పరిస్థితి లేదు.


