ఘనంగా సాగర్ డ్యాం శంకుస్థాపన దినోత్సవం
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేసి బుధవారం నాటికి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డ్యాం సూపరింటెండెంట్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పైలాన్ వద్ద శంకుస్థాపన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అప్పటి చీఫ్ ఇంజనీర్ మీర్ జాఫర్ అలీ విగ్రహానికి, ప్రాజెక్టు నిర్మాణంలో అసువులు బాసిన కార్మికులకు గుర్తుగా పైలాన్ వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎస్‌ఈ నాగేశ్వర్‌రావు, డ్యాం భద్రతాధికారి శ్రీనివాసరావు, ఎస్‌ఐ రఘు, డ్యాం ఇంజనీర్లు రమేష్, చంద్రమౌళి, జనార్దన్, ముజీబ్, డ్యాం సిబ్బంది పాల్గొన్నారు.


