137 పంచాయతీలు, 1,040 వార్డు స్థానాలకు ఎన్నికలు
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 11 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి,యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఆలేరు నియోజకర్గంలోని ఆరు మండలాల్లో 137 పంచాయతీలు, 1,040 వార్డు స్థానాల్లో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండల పరిషత్ కార్యాలయాల ఆవరణల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో సిబ్బంది పోలింగ్ సామగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది.
137 పంచాయతీలు, 1,040 వార్డులు
ఆలేరు, ఆత్మకూర్(ఎం), బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజాపేట మండలాల్లో 153 పంచాయతీలు, 1,284 వార్డులున్నాయి. ఇందులో 16 పంచాయతీలు, 243 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 137 పంచాయతీలు, 1,040 వార్డులకు నేడు పోలింగ్ జరగనుంది. సర్పంచ్‌కు 411, వార్డు సభ్యుల స్థానాల్లో 2,652 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. మొదటి దశలో 1,57,817 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీందరికీ ఎన్నికల అధికారులు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశారు. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 1,177 బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో ఉంచారు.
ఈ మూడు వార్డులకు ఎన్నికల్లేవు
తొలివిడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో మూడు వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. రాజా పేట మండలం పుట్టగూడెం పంచాయతీలో 8వ వార్డులో నామినేషన్ దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. సర్పంచ్ పదవి ఏకగ్రీవం సందర్భంగా కుదిరిన ఒప్పందం ప్రకారం సర్పంచ్ అభ్యర్థిగా రంగంలో దిగిన రవీందర్‌నాయక్‌ను ఉపసర్పంచ్ చేయడానికి నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. అదే విధంగా తుర్కపల్లి మండలం మల్కాపురంలో 8వ వార్డు ఎస్టీ రిజర్వ్‌డు కాగా ఇక్కడ ఓటర్లు లేనందున ఎవ్వరూ నామినేషన్ వేయలేదు. బొమ్మలరామారం మండలం పిల్లిగుండ్ల తండాలో ఒక వార్డుకు తక్కువ వయసున్న అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికల అధికారులు తిర్కస్కరించారు. ఈ మూడు చోట్ల ఎన్నికల నిర్వహణకు త్వరలో తేదీలు ప్రకటించనున్నారు.
వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది.
మొదటి దశలో..
మండలాలు 06
పోలింగ్ కేంద్రాలు 1,040
పోలింగ్ సిబ్బంది 3,100
పీఓలు 1,040
ఓపీఓలు 1,396
స్టేజ్ –2 అధికారులు 137
జోనల్ అధికారులు 29
బ్యాలెట్ బాక్స్‌లు 1,177
ఫ ఉదయం 7గంటల నుంచి పోలింగ్
ఫ సర్వం సిద్ధం చేసిన అధికారులు
ఫ 1,040 పోలింగ్ కేంద్రాలు, 1,57,817 మంది ఓటర్లు
గ్రామ పంచాయతీలు, వార్డులు, ఓటర్లు
మండలం జీపీలు వార్డులు పోలింగ్ మొత్తం పురుషులు మహిళలు
స్టేషన్లు ఓటర్లు
ఆలేరు 16 140 140 20,998 10,242 10,755
ఆత్మకూర్(ఎం) 23 192 192 249,48 12,610 12,338
బి.రామారం 35 284 284 27,605 13,672 13,932
రాజాపేట 23 206 206 29,904 14,807 15,097
తుర్కపల్లి 33 266 266 26,747 13,236 13,511
యాదగిరిగుట్ట 23 198 198 27,615 13,657 13,958
137 పంచాయతీలు, 1,040 వార్డు స్థానాలకు ఎన్నికలు
137 పంచాయతీలు, 1,040 వార్డు స్థానాలకు ఎన్నికలు
137 పంచాయతీలు, 1,040 వార్డు స్థానాలకు ఎన్నికలు
137 పంచాయతీలు, 1,040 వార్డు స్థానాలకు ఎన్నికలు
137 పంచాయతీలు, 1,040 వార్డు స్థానాలకు ఎన్నికలు


