పరిమితికి మించి ఖర్చు చేయొద్దు
మోత్కూరు: సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనల మేరకు ఖర్చు చేయాలని, పరిమితికి మించితే అనర్హత వేటు పడుతుందని ఎంపీడీఓ బాలాజీనాయక్ తెలిపారు. బుధవారం మోత్కూరు మండల పరిషత్ కార్యాలయంలో అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి ఎన్నికల వ్యయంపై సూచనలు చేశారు. సర్పంచ్‌కు రూ.1.50 లక్షలు, వార్డు స్థానాల్లో రూ.50వేలకు మించి ఖర్చు చేయరాదన్నారు. ప్రచారానికి వినియోగంచే వాహనాలు, మైక్‌లు, ర్యాలీలు, సభల నిర్వహణకు ముందస్తుగా అనుమతి పొందాలన్నారు. కొత్తగా తెరిచిన బ్యాంక్ ఖాతా నుంచి మాత్రమే ఖర్చు చేయాలని పేర్కొన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు వెంకట్‌రెడ్డి, ట్రైనర్ సుధాకర్, తహసీల్దార్ జ్యోతి, సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


