రెండేళ్లకు దారికొచ్చిన పనులు
భువనగిరి : జిల్లా కేంద్రం భువనగిరిలో ఫుట్‌పాత్ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. సమీకృత మార్కెట్ సముదాయం నుంచి పాత బస్టాండ్ వరకు ఫుట్‌పాత్ నిర్మించనున్నారు. ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా గత ప్రభుత్వం హయాంలోనే ఫుట్‌పాత్ నిర్మించాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి పనులు ప్రారంభించారు.
దుకాణదారులకు నష్టం వాటిల్లకుండా పనులు
టీచర్స్ కాలనీకి వెళ్లే అండర్‌పాస్ నుంచి రైల్వేస్టేషన్ వరకు సుమారు 2 కిలో మీటర్ల మేర ప్రధాన రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో దుకాణాల ముందు భాగాలను తొలగించారు. కానీ, పనుల్లో జాప్యం వల్ల చాలా మంది వ్యాపారులు మళ్లీ ఫుట్‌పాత్ మీదకు మెట్లు, షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం పనులు ప్రారంభించినప్పటికీ వాటిని తొలగించకుండా ఫుట్‌పాత్ నిర్మిస్తున్నారు.
ఫ భువనగిరిలో ఫుట్‌పాత్ పనులు ప్రారంభం
ఫ సమీకృత మార్కెట్ నుంచి పాతబస్టాండ్ వరకు నిర్మాణం


