పల్లెవించిన చైతన్యం
న్యూస్‌రీల్
తొలి విడత ప్రశాంతం
పలు గ్రామాల్లో ఉద్రిక్తత
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఓటేసేందుకు కదిలిన గ్రామాలు
ఒక్క ఓటుతో విజయం
మర్రికుంటతండా, చిన్ననారాయణపురంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఒక్క ఓటుతో గెలుపొందారు.
శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
- 10లో
తొలి విడతలో 92.88 శాతం పోలింగ్ 137 పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతం
సాక్షి యాదాద్రి: ఓటు హక్కు వినియోగించుకోవడంలో పల్లె ప్రజలు స్ఫూర్తిని చాటారు. పోలింగ్ కేంద్రాలకు భారీగా కదిలి ఆదర్శంగా నిలిచారు. శుక్రవారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 92.88 శాతం పోలింగ్ నమోదైంది.ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుదీరారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు సైతం స్వగ్రామాలకు వచ్చి ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.
మందకొడిగా మొదలై..
ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ప్రారంభంలో ఓటింగ్ మందకొడిగా కొనసాగగా 11 గంటల తర్వాత పుంజుకుంది. చివరి గంటలో గణనీయంగా పెరిగింది. మేజర్ గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుదీరారు. ఎన్నికల సందర్భంగా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది.ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఈసారి కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది.
బొమ్మలరామారంలో అత్యధికంగా..
అత్యధికంగా బొమ్మలరామారం మండలంలో 94.53 శాతం, అత్యల్పంగా ఆలేరు మండలంలో 90.07 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడత ఎన్నికలు జరిగిన ఆరు మండలాల్లో 1,55,552 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1,44,483 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 72,026, మహిళలు 72,456, ఇతరులు ఒకరు ఉన్నారు.
137 పంచాయతీలకు ఎన్నికలు
ఆలేరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో 153 గ్రామ పంచాయతీలు, వార్డులు 1,284 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 16 పంచాయతీలు, 243 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 137 పంచాయతీలు, 1,040 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ స్థానాలకు 411 అభ్యర్థులు, వార్డులకు 2,652 మంది పోటీ పడ్డారు. తొలిసారిగా ఓటర్లు నోటాకు ఓట్లు వేశారు.
అఽధికారుల పర్యవేక్షణ
బొమ్మలరామారం మండలం ఫక్కీర్‌గూడెం మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు గౌతమి సందర్శించారు. అదే విధంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, డీసీపీ అక్షాంశ్‌యాదవ్, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి పలు పోలింగ్‌కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు.
–జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ హనుమంతరావు
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పర్యావరణ హితంగా అలంకరించిన గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగిసింది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించాం. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయింది. 137 గ్రామ పంచాయతీల్లో తొలి విడుత ఎన్నికలు పూర్తి చేశాం.
పల్లెవించిన చైతన్యం
పల్లెవించిన చైతన్యం
పల్లెవించిన చైతన్యం
పల్లెవించిన చైతన్యం
పల్లెవించిన చైతన్యం
పల్లెవించిన చైతన్యం


