కాంగ్రెస్ మద్దతుదారుల హవా
ఐలయ్య స్వగ్రామంలో కాంగ్రెస్ విజయం
సాక్షి, యాదాద్రి : తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు హవా కొనసాగింది. 87 మంది విజయం సాధించారు. తరువాత స్థానంలో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఆలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 137 పంచాయతీలు, 1,040 వార్డులకు గురువారం ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ స్థానాలకు 411 అభ్యర్థులు, వార్డులకు 2,652 మంది పోటీ పడ్డారు. ఇందులో 87 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. బీఆర్‌ఎస్ 50, బీజేపీ 3, సీపీఐ 2, సీపీఎం 1, ఇండిపెండెంట్లు 10 మంది సర్పంచ్ పీఠం దక్కించుకున్నారు.
పలుచోట్ల కాంగ్రెస్‌ను దెబ్బతీసిన రెబల్స్
పలు గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక వార్డులు గెలుపొందగా సర్పంచ్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. రెబల్‌గా పోటీ చేసిన పలువురు కాంగ్రెస్ అభ్యర్థుల విజయాలను తారుమారు చేశారు. బీఆర్‌ఎస్ 50 స్థానాలు కై వసం చేసుకోగా.. ఓటమిపాలైన పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కై వసం చేసుకోవడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి.
వివిధ పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు వచ్చిన స్థానాలు
మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ సీపీఐ సీపీఎం ఇతరులు
ఆలేరు 16 09 06 –– –– 01 ––
ఆత్మకూర్ 23 13 09 01 –– –– ––
రాజాపేట 23 11 10 01 –– –– 01
బి.రామారం 35 14 14 01 –– –– 06
తుర్కపల్లి 33 27 05 –– –– –– 01
యాదగిరిగుట్ట 23 13 06 –– 02 –– 02
మొత్తం 153 87 50 03 02 01 10
ఫ తొలి విడతలో 87 స్థానాల్లో విజయం
ఫ గట్టి పోటీ ఇచ్చిన బీఆర్‌ఎస్ మద్దతుదారులు
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్వగ్రామం సైదాపురంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాఽధించారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత స్వగ్రామం వంగపల్లిలోనూ బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
కాంగ్రెస్ మద్దతుదారుల హవా


