పోచంపల్లి ఇక్కత్‌ను ఆదుకోవాలి
సాక్షి, యాదాద్రి : పోచంపల్లి చేనేత ఇక్కత్ డిజైన్ల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ సెక్టార్ అంశంపై జరిగిన సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణలో సుమారు 30 వేల మగ్గాలు ఉంటే అందులో పోచంపల్లిలోనే 15 వేల మగ్గాలు ఉన్నాయన్నారు. వీటిపై ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇక్కత్ వస్త్రాలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. పోచంపల్లి ఇక్కత్‌ను డుప్లికేట్ డిజైన్లు ఆక్రమించాయని, దీని వల్ల మార్కెట్ తీవ్రంగా దెబ్బతింటుందన్నారు.డూప్లికేట్ డిజైన్లను అరికట్టాలని, రూ.100 కోట్లతో ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఫ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి


