బందోబస్తును పర్యవేక్షించిన డీసీపీ
సాక్షి, యాదాద్రి: మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు డీసీపీ అక్షాంశ్‌యాదవ్ తెలిపారు. పలు గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో పోలీస్ యంత్రాంగం సక్సెస్ అయిందని, వారికి స్థానికులు సహకరించారని అభినందనలు తెలిపారు.
రెండు, మూడో విడతలో ఆంక్షలు
2వ విడత ఎన్నికలు జరిగే భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ, 3 విడత గుండాల, మోటకొండూరు, చౌటుప్పల్, నారాయణపూర్ మో త్కూర్, అడ్డగూడూరు, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచా రం, మాడ్గుల్, గ్రీన్ ఫార్మా, మాడ్గుల్ పోలింగ్ స్టేషన్ల పనరిధిలో ఆంక్షలు విధించినట్లు సీపీ సుధీర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు వెల్లడించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద గుమిగూడరాదని స్పష్టం చేశారు.
14,17 తేదీల్లో సెలవు
భువనగిరిటౌన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ జరిగే మండలాల్లో ఆ రోజు సెలవులు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.14,17 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయలు, ఇతర సంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. సెలవు ఇవ్వడం సాధ్యంకాని పక్షంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు టైమ్ ఆఫ్ కల్పించాలని పేర్కొన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


