కోతుల ‘పంచాయితీ’
కోతులను పట్టి తరలించిన అభ్యర్థులకే ఓటు వేస్తామని ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు తేల్చి చెబుతున్నారు.
● పోస్టల్ బ్యాలెట్ ఆరంభం
- 8లో
భువనగిరిటౌన్ : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులంతా తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మెదటి విడత పోలింగ్ జరిగే ఆలేరు, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, ఆత్మకూరు(ఎం) మండలాల్లో పోలింగ్ విధుల్లో పాల్గొనే ఆర్వోలు, ఏఆర్వోలు, పీఓలు, ఓపీఓలు, జోనల్ అధికారులు, పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది మండల పరిషత్ కార్యాలయాల్లో ఫారం–14 ఫారం నింపి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఎంపీడీఓలు నమూనా పోలింగ్ కేంద్రాన్ని తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.


