కోడ్ వేళ.. తప్పని నిరీక్షణ!
భూదాన్‌పోచంపల్లి : చేనేత రుణమాఫీ వచ్చినట్లే వచ్చి ఆగిపోవడంతో నేతన్నలు ఆయోమయంలో పడిపోయారు. ఈనెల 20న కార్మికులు హైదరాబా ద్‌లోని హ్యాండ్లూమ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో దిగొచ్చిన ప్రభుత్వం.. వెంటనే రుణమాఫీకి రూ.33కోట్లు విడుదల చేస్తున్నామని ప్రకటించింది.
కోడ్ వచ్చిన రోజే..
ప్రభుత్వం డిసెంబర్ 25న రుణమాఫీ నిధులను ఆయా జిల్లాల చేనేత, జౌళిశాఖ అధికారుల ఖాతాల్లో జమ చేసింది. అదే రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రుణ మాఫి ప్రక్రియ అర్ధాతరంగా ఆగిపోయింది. దీంతో చేనేత కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిధులొచ్చినా ఎన్నికల కోడ్‌తో కార్మికులకు అందని పరి స్థితి నెలకొంది. 17 వరకు కోడ్ అమల్లో ఉండటంతో కార్మికులు అప్పటి వరకు నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
2,803 మందికి లబ్ధి
2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు చేనేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న లక్ష లోపు వ్యక్తిగత రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 2,803 మందికి రూ.23.25 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 2,380 మంది రూ.19.25 కోట్లు రుణమాఫీకి అర్హులని తేల్చారు. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా రూ.48 కోట్లు రుణమాఫికి అర్హత సాధించారని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ, ప్రభుత్వం రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేసింది. యాదాద్రి జిల్లాకు 19.25 కోట్లు రుణమాఫీ జరగాల్సి ఉండగా, నిధులు పూర్తిస్థాయిలో రాలేదని తెలుస్తుంది.
నేతన్నకు నిలిచిపోయిన రుణమాఫీ డబ్బులు
ఫ యాదాద్రి జిల్లాకు రూ.19.25 కోట్లు
విడుదల చేసిన ప్రభుత్వం
ఫ అదే రోజు అమల్లోకి గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి
ఫ 17 వరకు ఎదురుచూడాల్సిందే..


