చెల్లని ఓట్లను గుర్తించడంలో జాగ్రత్త
యాదగిరిగుట్ట రూరల్: చెల్లని ఓట్లను గుర్తించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఎన్నికల అధికారులకు సూచించారు.యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు, వసతులపై సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను గుర్తించి వారికి బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని, తిరిగి బ్యాలెట్ పేపర్‌ను బ్యాలెట్ బాక్సులో వేసే వరకు పీఓలు గమనించాలన్నారు. పోలింగ్ కేంద్రాలను అందంగా అలంకరించి మోడల్ పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. నిర్దేశిత సమయానికి పోలింగ్ పూర్తయ్యేలా చూసి, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టాలని పేర్కొన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ నవీన్‌కుమార్, తహసీల్దార్ గణేష్‌నాయక్ ఉన్నారు.
కలెక్టర్ హనుమంతరావు


