● ‘మూడో విడత’ వరకు మోడల్ కోడ్
భువనగిరిటౌన్ : గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి దశ పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఏకగ్రీవ పంచాయతీల్లోనూ కోడ్ యథాతదంగా అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, మూడో విడత ఫలితాలు వెలువడే వరకు పక్కాగా కోడ్ అమలయ్యేలా నిరంతరం నిఘా ఉంచాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు.


