వరి సాగులో చరిత్ర సృష్టించిన తెలంగాణ
గరిడేపల్లి: 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించిందని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లిలో రూ.200కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు, గడ్డిపల్లి నుంచి పాఠశాల వరకు రూ. 8.28కోట్లతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పొనుగోడు గ్రామంలో రూ.3.15కోట్లతో పొనుగోడు నుంచి అప్పన్నపేట వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులకు, మెయిన్‌రోడ్డు నుంచి పాత బస్టాండ్ వరకు రూ.50లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులకు, మల్లయ్యగూడెం నుంచి పాత నేరేడుచర్ల వరకు రూ.70లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు ప్రారంభించారు. అనంతరం పొనుగోడు ఊరచెరువులో సబ్సిడీ చేప పిల్లలను వదిలారు. గరిడేపల్లి నుంచి అలింగాపూర్ వరకు రూ. 30కోట్లతో నిర్మించిన డబుల్ రోడ్డును ప్రారంభించారు. గడ్డిపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తనిఖీ చేశారు. కేంద్రంలో తేమశాతం కొలితే యంత్రంతో పాటు ధాన్యంలో తేమశాతం పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రూ. 24వేల కోట్లతో 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. తుపాన్ కారణంగా తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులకు ధాన్యం అమ్మిన 48గంటల్లో మద్ధతు ధరతో పాటు బోనస్ కూడా అందించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మద్ధతు ధరతో పాటు బోనస్‌చెల్లించేందుకు రైతుల కోసం రూ. 25వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఆర్డీఓ శ్రీనివాసులు, ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారామయ్య, పీఆర్ ఈఈ వెంకటయ్య, డీఈ రమేష్, మత్స్యశాఖ అధికారి నాగుల్‌నాయక్, తహసీల్దార్ కవిత, నియోజకవర్గ నాయకులు అరుణకుమార్, సాముల శివారెడ్డి, రవికుమార్, కేఎల్‌ఎన్‌ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు త్రిపురం అంజన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీలు పైడిమర్రి రంగనాథ్, పెండెం శ్రీనివాస్‌గౌడ్, బచ్చలకూరి మట్టయ్య, మూలగుండ్ల సీతారాంరెడ్డి, కటకం రమేష్, గుండు రామాంజీగౌడ్, బాల్‌దూరి సందీప్, పరమేష్, కృష్ణప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్‌లు సత్యనారాయణ, ముత్యాలగౌడ్, నర్సిరెడ్డి, అభిల్, శకుంతలదేవి, విజయలక్ష్మి, రజిత పాల్గొన్నారు.
నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


