గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చివ్వెంల(సూర్యాపేట) :
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చివ్వెంల మండల పరిధిలోని గుంపుల గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెన్ పహాడ్ మండలం చీదెళ్లి గ్రామానికి చెందిన సీపీఎం గ్రామశాఖ కార్యదర్శి కొండమీది రాములు (51), సొంత పనుల నిమిత్తం బైక్‌పై సూర్యాపేటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో గుంపుల గ్రామ స్టేజీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


