‘కలల సందుక’ కవితా సంపుటి ఆవిష్కరణ
చిట్యాల : చిట్యాల మండలంలోని పిట్టంపల్లి గ్రామానికి చెందిన దివంగత కవి, రచయిత డాక్టర్ మండల స్వామి రచించిన ‘కలల సందుక’ కవితా సంపుటిని మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల స్వామి సమసమాజాన్ని కాంక్షించే కవిత్యాన్ని రచించారనొ కొనియాడారు. డాక్టర్ నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ వృత్తిదారుల జీవితాన్ని కవిత్వంలో నిలిపారని చెప్పారు. పెరుమాళ్ల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఎన్.బాలచారి, మోత్కూరి నరహరి, డాక్టర్ తండు కృష్ణకౌండిన్య, వేముగంటి మురళీకృష్ణ, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, డాక్టర్ ఉప్పల పద్మ, డాక్టర్ కనకటి రామకృష్ణ, గడ్డం శ్రీను, బండారు శంకర్, కొండేటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


