కుంగిన లోలెవల్ వంతెన
ఆలేరు : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఆలేరు–కొలనుపాక మార్గంలో ఉన్న లోలెవల్ వంతెన కుంగిపోయింది. కూలిపోయే దశకు చేరడంతో అప్రమత్తమైన పోలీసులు కుంగిన ప్రదేశంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. సిద్దిపేటకు వెళ్లేందుకు ఇదే మార్గం గుండా వెళ్లాల్సి ఉండడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. భారీ వాహనాలు సైతం ఈ రోడ్డు గుండానే రాకపోకలు సాగిస్తుంటాయి.ఈ రోడ్డుపై ఉన్న లోలెవల్ వంతెన కూలిపోయే దశకు చేరడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పెను ప్రమాదం జరుగక ముందే అధికారులు తేరుకొని దెబ్బతిన్న వంతెన ప్రదేశంలో రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. హైలెవ్ వంతెన నిర్మాణానికి రెండేంళ్ల క్రితమే రూ.4.50 కోట్లు మంజూరు చేశారు. కానీ నేటికీ ఎలాంటి పనులు చేపట్టక పోవడంతో ప్రస్తుతం వంతెన కుంగింది.


