ఏపూర్‌లో యాదాద్రి అధికారులు
జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు పొందిన ఏపూర్ గ్రామాన్ని యాదాద్రి జిల్లా అధికారులు సందర్శించారు.
- 9లో
ఘనంగా యువజనోత్సవాలు
భువనగిరి : జిల్లా యువజన సర్వీసులు, క్రీడలశాఖ ఆధ్వర్యంలో మంగళవారం భువనగిరి ఖిలా వద్ద యువజనోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ భా స్కర్‌రావు ప్రారంభించారు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, కవిత, జానపద నృత్యాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ అధికారి ధనుంజనేయులు, పురావస్తు శాఖ అధికారి నాగలక్ష్మి, కపిల్, రమేశ్‌రాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


