తేమ యంత్రాల పరిశీలన
రాజాపేట : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతంలో వ్యతా సం వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్న విషయమై సాక్షిలో ‘అన్నదాతకు తేమ టెన్షన్’ శీర్షికతో మంగళవారం కథనం ప్రచురితమైంది. దాంతో అధికారులు స్పందించారు. ఏఎంసీ సూపర్‌వైజర్ శ్రీనివాస్ రాజాపేట మండలంలోని పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల్లో వినియోగించే మాయిశ్చర్ మిషన్లను పరిశీలించారు. వ్యత్యాసం వచ్చే మిషన్లను స్థానిక రైస్ మిల్లులో వినియోగించే మాయిశ్చర్ మిషన్లకు అనుగుణంగా మార్పులు చేశారు. మిషన్‌లో కేవలం 100 గ్రాముల ధాన్యం పోసి తేమ శాతాన్ని చూడాలన్నారు.
తేమ యంత్రాల పరిశీలన


