ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
భువనగిరి : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల శివ, లావుడియా రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో మార్పు నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయక పోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసిన కళాశాలను తెరిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు , ఈర్ల రాహుల్, హిందూ రాణి ,ధరావత్ జగన్ నాయక్ నాయకులు జ్యోతిబాస్, వెంకటేష్, కావ్య పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కళాశాలల యాజమాన్యాలు ప్రవీణ్‌కుమార్, ప్రభాకర్, మణిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


