సాక్షి, యాదాద్రి : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు ముందడుగు పడే పరిస్థితులు కనిపించడం లేదు. ఇందుకు భూ సేకరణకు వెంటాడుతున్న కష్టాలు, ముంపుగ్రామాల నిర్వాసితులకు పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లింపులో జాప్యమే కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తప్ప.. పనులు వేగం పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం కలెక్టరేట్‌లో జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా నిధుల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ప్రధాన సమస్యలు ఇవీ..
● గంధమల్ల రిజర్వాయర్ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూలై 6వ తేదీన శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం భూ సేకరణ పనులు తుది దశకు చేరాయి. భూ సేకరణ పూర్తయిన చోట పరిహారం ఖరారైనా నేటికీ ఒక్క రైతుకూ చెల్లింపులు చేయలేదు.
● బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బొల్లేపల్లి కాలువల పనులు ఆగుతూ సాగుతున్నాయి. భూసేకరణకు అడ్డంకులు తొలగడం లేదు.
● దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ–7, దేవాదుల ప్రాజెక్టు ఏఆర్‌ఎంసీ, కాళేశ్వరం ప్యాకేజీ–14, 15,16 ప్యాకేజీల కింద భూసేకరణ, బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలైన బీఎన్ తిమ్మాపూర్, లప్పానాయక్‌తండా, చోక్లాతండాల నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాస గ్రామాలను నిర్మించాల్సి ఉంది. నిధుల లేమితో పనుల్లో పురోగతి కనిపించడం లేదు.
ధాన్యం కొనుగోళ్లపై..
వానాకాలం ధాన్యం కొనుగోళ్లు, ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షించనున్నారు. ధాన్యం దిగుబడి, సేకరణ లక్ష్యం, కొనుగోలు కేంద్రాలు, సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నట్లు తెలిసింది.
ఫ సాగునీటి కాల్వలకు భూ సేకరణ అడ్డంకులు
ఫ ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో జాప్యం
ఫ నిధులు విడుదల చేస్తేనే పనుల్లో వేగం
ఫ నేడు కలెక్టరేట్‌లో మంత్రులు ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్ సమీక్ష
నిధుల్లేక.. పనులు సాగక