
స్వర్ణగిరి క్షేత్రంలో ఆత్మదర్శన్
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో అదివారం రాత్రి సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఆత్మ దర్శన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మానేపల్లి రామారావు మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని ముందు తరాలకు అందించే ప్రయత్నంలో భాగంగానే ఆత్మ దర్శన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రాధా కన్నయ్య మానేపల్లి రామారావును సన్మానించారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంకీర్తనలు, ప్రవచనాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భక్తులు తదితరలు పాల్గొన్నారు.