
తొమ్మిదేళ్లయినా అద్దెభవనాల్లోనే..
ఫ అడ్డగూడూరు మండలంలో తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది.
ఫ వ్యవసాయ శాఖ కార్యాలయం రైతువేదికలో, ఎంపీడీఓ కార్యాలయం మండల విద్యావనరుల కేంద్రంలో కొనసాగిస్తున్నారు.
ఫ పోలీస్ స్టేషన్ భవనం పశుసంవర్ధక శాఖ ఆస్పత్రిలో నిర్వహిస్తున్నారు. దీని నిర్మాణం కోసం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే ప్రభుత్వం భూమిలో స్థలం కేటాయించారు. నిర్మాణం కోసం నిధులు కేటాయించకపోవడంతో స్థలం చుట్టూ కంచె వేసి వదివేశారు.
ఫ విద్యుత్ శాఖ కార్యాలయం మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లోని ఒక గదిలో నిర్వహిస్తున్నారు.
ఫ 26 అంగన్‌వాడీ కేంద్రాలకు 8 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
మోటకొండూర్, అడ్డగూడూరు : జిల్లాలో అడ్డగూడూరు, మోటకొండూర్ మండలాలు ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినా ఈ రెండు మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు శాశ్వత భవనాలకు నోచుకోవడం లేదు. ఇటీవల కొన్ని కార్యాలయాల ఏర్పాటుకు స్థల సేకరణ జరిగినా టెండర్ ప్రక్రియ వద్ద నిలిచిపోయింది. పక్కా భవనాలు లేక అధికారులు, సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మోటకొండూర్ మండలంలో..
మోటకొండూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నిర్వహిస్తున్నారు
ఎంపీడీఓ కార్యాలయం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంలో కొనసాగిస్తున్నారు.
పోలీస్ స్టేషన్ కార్యాలయం ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నారు.
పశువైద్య కేంద్రానికి భవనం లేక సబ్‌సెంటర్‌లో, వ్యవసాయ కార్యాలయాన్ని రైతు వేదికలో కేటాయించారు.
మండల విద్యుత్ కార్యాలయం మోటకొండూర్ సబ్‌స్టేషన్‌లోని కంట్రోల్ రూమ్‌కు మరమ్మతులు చేసి ఒక గదిని ఏఈ కార్యాలయానికి, మరో గదిని ఆపరేటింగ్ రూమ్‌కు కేటాయించారు.
మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల 2017 ఏర్పాటు కాగా ప్రైవేట్ భవనంలో నెలకు రూ.లక్ష రెంట్ చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు స్థల సేకరణ కూడా చేయలేదు.
మండలంలో 27 అంగన్‌వాడీ సెంటర్‌లు ఉండగా 13 సొంత భవనాలు కలిగి ఉన్నాయి.
3 విద్యుత్ సబ్‌స్టేషన్ కంట్రోల్ రూమ్‌లు ఉండగా ముత్తిరెడ్డిగూడెంలోని కంట్రోల్ రూమ్ ఎప్పుడు కూలిపోతుందోనని భయం గుప్పెట్లో ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నాలుగు సబ్‌సెంటర్‌లు ఉండగా అందులో ఒక్క ప్రభుత్వ భవనం లేదు.
చాడ, నాంచారిపేట గ్రామాల్లో భవనాల నిర్మాణం ప్రారంభమైనా మాటూర్, మోటకొండూర్‌కు భవనాలు లేవు.
మోటకొండూరు మండలంలో 20 గ్రామపంచాయతీలు ఉండగా 7 పంచాయతీలకు పక్కా భవనాలు లేవు.
ఫ మోటకొండూర్, అడ్డగూడూరులో పక్కా భవనాలకు నోచుకోని
ప్రభుత్వ కార్యాలయాలు
ఫ పాలనంతా అద్దె భవనాల్లోనే
ఫ ఇరుకు గదులతో తప్పని తిప్పలు

తొమ్మిదేళ్లయినా అద్దెభవనాల్లోనే..