
యాదగిరీశుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో విశేష పూజలు కొనసాగాయి. ఆదివారం ఉదయం సుప్రఽభాత సేవ, ఆరాధన నిర్వహించారు. అనంతరం నిజాభిషేకం, అర్చన జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించి, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం చేపట్టారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రి సమయంలో శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి, ఆలయ ద్వార బంధనం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
16న మత్స్యగిరి ఆలయ హుండీల లెక్కింపు
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని హుండీలను ఈనెల 16న లెక్కించనున్నారు. ఈమేరకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నరేష్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రేపు బుద్ధవనంలో
ధమ్మవిజయం వేడుకలు
నాగార్జునసాగర్: ఈ నెల 14న ఉదయం 11 గంటలకు బుద్ధవనంలోని సమావేశ మందిరంలో ధమ్మవిజయం వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బుద్ధుడి ధమ్మంపట్ల ఆకర్షితుడైన సామ్రాట్ అశోకుడు ఇకపై దిగ్విజయం స్థానంలో, దమ్మ విజయం చేకూరేలా చేస్తానని శాసనాల ద్వారా ప్రకటించిన సందర్భానికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూణే యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మహేశ్ దియోకర్ దమ్మవిజయ విశిష్టతను వివరిస్తారని తెలిపారు. ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, హైద్రాబాద్ రెడ్డి మహిళా కళాశాల ప్రొఫెసర్ కె.ముత్యంరెడ్డి, ఎంజేపీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవీలత హాజరు కానున్నట్లు తెలిపారు. స్థానికులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

యాదగిరీశుడికి విశేష పూజలు