
ఊరి బాగు కోసం ఏకమైన యువత
రామన్నపేట: కన్నతల్లి వంటి ఊరును ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన యువత ఏకమయ్యారు. పలు ఎజెండాలతో సుమారు 30 మంది యువకులు ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామంలోకి డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు దరిచేరనీయకూడదని, వాటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రజలను చైతన్యం చేయాలని తీర్మానించారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా గ్రామాభివృద్ధికి కృషి చేసేవారిని ఎన్నుకునే విధంగా ప్రజలను చైతన్యం చేయాలని నిర్ణయించారు.