ధాన్యం దళారుల పాలు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం దళారుల పాలు

Oct 13 2025 6:04 AM | Updated on Oct 13 2025 6:04 AM

ధాన్యం దళారుల పాలు

ధాన్యం దళారుల పాలు

కొనసాగుతున్న వివాదం

వివిధ మండలాల్లో ధరలు ఇలా..

సాక్షి, యాదాద్రి: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట దళారుల పాలవుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో తెలియని పరిస్థితి ఉండటంతో అప్పటి వరకు ఎదురుచూడలేక రైతులు అవసరాల కోసం ధాన్యాన్ని ప్రైవేట్‌కు అమ్ముకుంటున్నారు. దీనిని ఆసరాగా తీసుకుంటున్న దళారులు, వ్యాపారులు మద్దతు ధర కంటే రూ.600 వరకు తక్కువ చెల్లిస్తున్నారు. పలు గ్రామాల్లో ఉదయాన్నే కల్లాల వద్ద కాంటాలు పెట్టి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

2.82 లక్షల ఎకరాల్లో వరి సాగు

వానాకాలం సీజన్‌లో జిల్లాలో 282,897 ఎకరాల్లో వరి సాగైంది. సుమారు 6 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం 325 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాకు రూ.2389, సాధారణ రకం రూ.2369 ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. ఓ వైపు వరి కోతలు ఊపందుకొని ధాన్యం వెల్లువలా వస్తోంది. అయినా కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత లేదు.

వెంటనే డబ్బులు చెల్లిస్తే 2 శాతం కమీషన్‌

కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్న దళారులు, వ్యాపారులు రైతుల అవసరాలను ఆసరా చేసుకొని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా రకరకాల కొర్రీలు పెడుతున్నారు. వెంటనే డబ్బులు చెల్లించాలంటే 2 శాతం కమీషన్‌ కట్‌ చేస్తున్నారు. లేదంటే 15 రోజుల వరకు వాయిదా పెడుతున్నారు.

కొనుగోళ్లపై అప్రమత్తం చేసిన కమిషనర్‌

జిల్లాలో ధాన్యం కొనుగోలుపై యంత్రాంగాన్ని సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అప్రమత్తం చేశారు. గురువారం ఆయన జిల్లాలో పర్యటించారు. ధాన్యం కొనుగోలుకు తీసుకుంటున్న చర్యలపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఫ కొనుగోలు కేంద్రాల

ఏర్పాటులో జాప్యం

ఫ గత అనుభవాల దృష్ట్యా ప్రైవేట్‌కు అమ్ముకుంటున్న రైతులు

ఫ ఇదే అదనుగా భావించి తక్కువ

ధరకు కొనుగోలు చేస్తున్న దళారులు

పది శాతం బ్యాంక్‌ గ్యారంటీ విషయంలో జిల్లాలోని రైస్‌ మిల్లర్లు, అధికారుల మధ్య వివాదం కొనసాగుతోంది. తమకు రావాల్సిన సీఎంఆర్‌ చార్జీలు ఇప్పించే వరకు ధాన్యం కొనుగోలు చేయబోమని మిల్లర్లు ఇటీవల కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అయితే జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించడంతోపాటు మిల్లులకు ధాన్యం కేటాయింపులు కొనసాగుతున్నాయి. మిల్లులకు కేటాయించే ధాన్యంలో పదిశాతం విలువ ను మిల్లర్లు ప్రభుత్వానికి గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది. ఒక వేళ మిల్లర్లు పేచి పెడితే ప్రభుత్వ గోదాముల్లో వడ్లు దించుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు ఉన్నారు.

ఫ ఆత్మకూరు(ఎం) మండలంలో రెండు వారాల క్రితమే వరి కోతలు మొదలయ్యాయి. దళారులు, వ్యాపారులు రోడ్ల పక్కన, కల్లాల వద్ద కాంటాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. క్వింటా రూ.1800 చెల్లిస్తున్నారు.

ఫ ఆలేరు, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోనూ రూ.1800కు మించి ఎక్కువ చెల్లించడం లేదు. అడ్డగూడూరు మండలంలో రూ.1600లే చెల్లిస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.

ఫ భూదాన్‌పోచంపల్లి మండలంలోని రేవనపల్లి, గౌస్‌కొండ, పెద్దరావులపల్లి తదితర గ్రామాల్లో గత నాలుగు రోజులుగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. రైతులు టాక్టర్లలో తీసుకువచ్చి ఆయా సెంటర్లో పోసి ఆరబెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement