
నీటి సంఘాలతోనే చెరువుల అభివృద్ధి
నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఎన్నుకుంటేనే చెరువులు అభివృద్ధి చెందుతాయి. గతంలో నీటి సంఘాల పాలకవర్గాలు ఉండటం వలన నీటిని పొదుపుగా వాడుకోవడమే కాకుండా వాటి పర్యవేక్షణ కూడా పకడ్బందీగా ఉండేది. గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం పేరుతో చెరువులను అభివృద్ధి చేసినా అజమాయిషీ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికలపై దృష్టి సారించాలి.
– చెన్ను వెంకట్‌రెడ్డి, రైతు, బట్టుగూడెం, పెద్దవూర మండలం