
చింపాంజీ, సింహం మాస్క్.. కోతులు షాక్
అడ్డగూడూరు: పాఠశాలలోకి కోతులు రాకుండా అడ్డగూడూరు మండలం కోటమర్తి స్కూల్ విద్యార్థులు వినూత్న ఆలోచన చేశారు. పాఠశాల పరిసరాల్లో కొంతకాలంగా కోతులు గుంపులుగా సంచరిస్తున్నాయి. అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో పాఠశాల ఆవరణలోకి వచ్చి విద్యార్థులపై దాడి చేస్తున్నాయి. కోతుల బెడదనుంచి రక్షణ పొందడానికి ఉపాధ్యాయులు వినూత్న ఆలోచన చేశారు. విద్యార్థులకు చింపాంజీ, సింహం మాస్కులు ధరింపజేసి కోతులు వచ్చిన సమయంలో వాటిని బయపెట్టసాగారు. దీంతో కోతుల బెడదకు చెక్ పెట్టినట్టు అయ్యిందని ఉపాధ్యాయులు తెలిపారు.