
కాంగ్రెస్ నాయకులను నిలదీయండి
భూదాన్‌పోచంపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలంతా నిలదీయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలవిగాని హామిలిచ్చి, మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా మహిళలకు నెలకు రూ.2500, పింఛన్లు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం పథకాలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు రావల్సిన బాకీని వసూల్ చేసే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సర్కార్ రెండు పంటల రైతుబంధు ఎగ్గొట్టిందని, నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డదో చెల్లించాలని ప్రజలను చైతన్యం చేస్తూ ఇంటింటా కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ పాక వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, కోట మల్లారెడ్డి, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, బత్తుల శ్రీశైలంగౌడ్, బందారపు లక్ష్మణ్, రంగ విశ్వనాధం, ప్యాట చంద్రశేఖర్, మధుసూధన్, కొంతం ఈశ్వరయ్య, సతీష్, మల్లేశ్, భాస్కర్, కంజర్ల గణేశ్ పాల్గొన్నారు.
ఫ పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి