
సాంకేతిక కోర్సులతో ఉద్యోగ అవకాశాలు
భువనగిరి: సాంకేతిక కోర్సుల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. భువనగిరి పట్టణ శివారులో ఉన్న అడ్వా న్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను గురువారం ఆయన పరి శీలించారు. అడ్వాన్స్‌డ్ టెకాల్నజీలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. సాంకేతిక కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటా యన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అంతకుముందు ఏటీసీలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అందుబాటులో ఉన్న కోర్సులు, వసతుల వివరాలు తెలుసుకున్నారు.