
విస్తరణ దిశగా జగదేవ్‌పూర్ రోడు్డ
భువనగిరిటౌన్ : ప్రమాదాలకు నిలయంగా మారిన భువనగిరి–జగదేవ్‌పూర్ రోడ్డు విస్తరణకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నిశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో పలు నిర్ణయాలను తీసుకున్నారు. రోడ్డు మరమ్మతు పనులతో పాటు, ట్రాఫిక్ రూల్స్ తెలిపే బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు రూ.6 లక్షలు, రైల్వే బిడ్జి పూర్తి స్థాయిలో మరమ్మతులకు రూ.76 లక్షలు మంజూరు చేశారు. నెల రోజులలో రైల్వే బిడ్జి పనులు ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. కాగా ఈ నెల 18 నుంచి జగదేవ్‌పూర్ చౌరస్తా నుంచి ఇరువైపులా రోడ్డు ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్, పోలీస్ శాఖలను ఆదేశించారు.
తీసుకోనున్న చర్యలు ఇవే..
ఇరుకుగా ఉన్న జగ్‌దేవ్‌పూర్ బస్టాప్ వద్ద ఆటో స్టాండ్‌ను, బస్ షెల్టర్‌ను ముందుకు జరపనున్నారు. కూలీల అడ్డాను దూరంగా మార్చనున్నారు. ఫ్రీ టర్నింగ్ కోసం డబ్బాలను తొలగిస్తారు. ముందుగా ఉన్న రేకుల షెడ్లను తొలగిస్తారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్ అద్దె మడిగెలు, బ్యాంకులు, రిలయన్స్ మాల్, రైతు బజార్, రాఘవేంద్ర హోటల్ వంటి పలు ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య పరిష్కరానికి చర్యలు ప్రారంభించనున్నారు. అద్దెలకు ఇచ్చిన సెల్లార్‌లను పార్కింగ్‌కు ఉపయోగించేలా ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. భువనగిరిలో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు.
రోడ్డు ఆక్రమణ ప్రదేశాల గుర్తింపు
హౌసింగ్ బోర్డు కాలనీ ఎదురుగా సితార వైన్స్ సమీపంలో, హైదరాబాద్ చౌరస్తా వద్ద, జగదేవ్ పూర్ చౌరస్తా, జగదేవ్ రోడ్డు మార్గం, రైతు బజార్ ఎదుట ప్రిన్స్ కార్నర్ చౌరస్తా, ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద, వినాయక (అంబేద్కర్) చౌరస్తా వద్ద, కొత్త బస్టాండు వద్ద వలిగొండ రోడ్డు మార్గంలో, గాంధీ పార్కు వద్ద, పాత బస్టాండ్‌లోని కూరగాయల విక్రయించే స్థావరాలు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు గుర్తించారు.
ప్రమాదరహిత రోడ్డుగా మార్చేందుకు కార్యాచరణ సిద్ధం
రెండు రోజులుగా వరుస సమీక్షలు
పనులకు రూ.82 లక్షలు మంజూరు
రేపటిలోగా ఆక్రమణలు
తొలగించాలని ఆదేశాలు
స్వచ్ఛందంగా వెనకకు జరగాలి : అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
భువనగిరి మున్సిపల్ పరిధిలోని జగ్‌దేవ్‌పూర్ వైపు రహదారిని ఆక్రమించుకున్న వారు ఈనెల 18లోపు స్వచ్ఛంద వెనకకు జరిగి అధికారులకు సహకరించాలని, లేని పక్షంలో 19న స్వయంగా అధికారులు వచ్చి తొలగిస్తారని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం భువనగిరిలో స్థానిక వీధి వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ పరిధిలోని పలు రోడ్ల వెంబడి, ముఖ్య కూడళ్లలో అనధికారికంగా వీధి వ్యాపారాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, రాచకొండ మున్సిపల్ కమిషనర్ జి.రామలింగం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ విభాగం, రాచకొండ, మున్సిపల్ అధికారులు, వీధి విక్రయదారున్నాయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

విస్తరణ దిశగా జగదేవ్‌పూర్ రోడు్డ