
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
మోటకొండూర్: విద్యార్థులు చదువులతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. మోటకొండూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్–14, 17 జిల్లా స్థాయి ఖోఖో పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఎంతో చురుకుగా ఉండడమే కాకుండా క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని, ఆటల్లో గొప్పగా రాణించి భవిష్యత్‌లో మంచి పేరును తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈడీ రఘురాంరెడ్డి, గడసంతల సీత, మధుసూదన్, నాతి మల్లేష్, కృష్ణమూర్తి, విశ్రాంత పీఈటీ పూల నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య