
బాల సంఘంలో చేరి వడిసెలు పట్టాం
రామన్నపేట: రజకార్లతో పోరాటం సమయంలో నా వయస్సు 14 సంవత్సరాలు. కమ్యూనిస్టు నాయకులు ఆరుట్ల రామచంద్రారెడ్డి, కాచం కృష్ణమూర్తి పిలుపు మేరకు నాతో పాటు పలువురు కలిసి బాల సంఘంలో చేరాం. ఉద్యమాన్ని అణచివేసేందుకు మా గ్రామంలో డాగ్ బంగ్లాను నిర్మించారు. అందులో మిలిటరీ క్యాంపు ఉండేది. ఒకసారి మిలిటరీ తుపాకీ మాయమైంది. దీంతో అనుమానం వచ్చిన ప్రతిఒక్కరిని క్రూరంగా హింసించారు. వడిసెలు, కారంపొడి పట్టుకొని సాయుధ పోరాటంలో పాల్గొన్నాం. మా కంటే ముందు గ్రామానికి చెందిన చాలా మంది యువకులు సంఘంలో పనిచేశారు.
– ఉయ్యాల లక్ష్మీనర్సు, సాయుధ పోరాట యోధుడు, మునిపంపుల