
కొరియర్‌గా పనిచేశా
ఆత్మకూరు(ఎం): సాయిధ పోరాటంలో రావి నారాయణరెడ్డికి కొరియర్‌గా పనిచేశాను. అప్పుడు నా వయస్సు 18 సంవత్సరాలు. పెత్తందార్ల ఆగడాలు నశించాలంటూ రాత్రి పూట గ్రామాల్లో గోడల మీద రాతలు రాసేవాడిని. మోత్కూరు ఠాణా మీద సాయుధ పోరాట దళాలు చేసిన దాడిలో రావి నారాయణరెడ్డితో కలిసి పాల్గొన్నా. రావి నారాయణరెడ్డి ఎక్కడకు పోతే అక్కడికి వెళ్లేవాడిని. రాచకొండ, చల్లూరు, గుడిమల్కాపురం గుట్టల్లో రహస్యంగా వారితో పాటు ఉండేవాడిని. కొరియర్‌గా పనిచేస్తున్నావంటూ పంజాబ్ నుంచి వచ్చిన మిలిటరీ పోలీసులు కొట్టిన దెబ్బలు ఇప్పటికీ నా ఎడమ కాలుకు ఉన్నాయి. ఇప్పడు నా వయస్సు 92 సంవత్సరాలు.
– బత్తిని యాదగిరి, సాయుధ పోరాట యోధుడు, పుల్లాయిగూడెం