
టీఎల్‌ఎం మేళాతో బోధన సులభం
భువనగిరి : టీఎల్‌ఎం మేళాతో విద్యార్థులకు సులభతరంగా బోధన చేయడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణ శివారులోని ఏకే ప్యాలేస్‌లో జిల్లా స్థాయి టీఎల్‌ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. తరగతి గదిలో విద్యాబోధనకు టీఎల్‌ఎం అత్యంత అవసరమన్నారు. రెడీమేడ్‌గా కాకుండా ఉపాధ్యాయులు సొంతంగా తయారు చేసిన టీఎల్‌ఎంలను ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న టీఎల్‌ఎలకు సృజనాత్మకత జోడించి ప్రదర్శించాలన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయికి ఎంపికై న ఎగ్జిబిట్స్‌ను రూపొందిన ఉపాధ్యాయులకు మెమొంటోలను అందజేశారు. అంతకుమందు అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, టీజీఓ రాష్ట్ర కోశాధికారి మందడి ఉపేందర్‌రెడ్డి మేళాను ప్రారంబించారు. జిల్లాలోని 17 మండలాల నుంచి మొత్తం జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళా 170 ప్రదర్శనలను ప్రదర్శించారు. నాలుగు విభాగాల నుంచి 8 ప్రదర్శనలు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కె.సత్యనారాయణ, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ జాన్ అఫ్గాన్,ఎంఈవో నాగవర్ధన్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికై న ఎగ్జిబిట్‌లు
● ఇంగ్లిష్ విభాగంలో ఎస్ నాగమణి (ప్రాథమిక పాఠశాల పులిగిల్ల, వలిగొండ మండలం), ఎం మమత (ప్రాథమిక పాఠశాల, జనగాం, నారాయణపురం మండలం).
● తెలుగు విభాగంలో హరిత(ప్రాథమిక పాఠశాల, బీఎన్‌తిమ్మాపురం,భువనగిరి మండలం), ఎస్ రమాదేవి(ప్రాథమిక పాఠశాల ఆరెగూడెం, నారాయణపురం మండలం),
● గణితం విభాగంలో సీహెచ్ ఉదయ్‌కుమార్(ప్రాథమిక పాఠశాల, దూదివెంకటాపురం, రాజాపేట మండలం), వి శ్రీకాంత్(ప్రాథమిక పాఠశాల, మైలార్‌గడ్డ తంగా, యాదగిరిగుట్ట మండలం),
● ఎన్విరాన్‌మెంట్ సైన్స్ విభాగంలో సీహెచ్ లక్ష్మీకుమారి(ప్రాథమిక పాఠశాల శారాజీపేట, ఆలేరు మండలం), డి.మంజుశ్రీ, (చౌటుప్పల్) ఎంపికయ్యాయి.
కలెక్టర్ హనుమంతరావు

టీఎల్‌ఎం మేళాతో బోధన సులభం