
‘రీజినల్’ అలైన్‌మెంట్ మర్చాలని రాస్తారోకో
సంస్థాన్ నారాయణపురం : రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ భూ నిర్వాసితులు మంగళవారం సంస్థాన్ నారాయణపురం–చౌటుప్పల్ ప్రధాన రహదారిపై చిమిర్యాల గ్రామం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసిత రైతులు మాట్లాడుతూ అలైన్‌మెంట్ మార్చే వరకు ఉద్యమిస్తామన్నారు. రాస్తారోకోతో రోడ్డు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. నారాయణపురం ఎస్‌ఐ జగన్ జోక్యం చేసుకొని ట్రాఫిక్‌ను క్లియరు చేయించారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, పల్లె పుష్పరెడ్డి, గుంటోజు శ్రీనివాసాచారి, తుమ్మల నర్సిరెడ్డి, దొంతగోని పెద్దులు, ఐతరాజు రాములు, గాజుల అంజయ్య, దోనూరి నర్సిరెడ్డి, బద్దం మల్లారెడ్డి, ఈదుల అనిల్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.